సీనియర్ హీరోల పాలిటి కల్పతరువుగా మారింది లేడీ సూపర్‌స్టార్ నయనతార. మొన్న సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్‌గారు’తో కలిసి సందడి చేసిన ఈ అందాలభామ, ప్రస్తుతం బాలకృష్ణ, మలినేని గోపీచంద్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమాలో బాలయ్యకు జోడీగా నటిస్తున్నది. త్వరలోనే ఈ సినిమా షూట్లో కూడా జాయిన్ కానుంది. ఇదిలావుంటే.. తాజాగా ఈ అగ్రతార మరో ప్రస్టేజియస్ మూవీకి కూడా సైన్ చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సల్మాన్‌ఖాన్ హీరోగా పైడిపల్లి వంశీ దర్శకత్వంలో టాలీవుడ్ నిర్మాత దిల్‌రాజు నిర్మించనున్న బాలీవుడ్ సినిమాలో నయనతార కథానాయికగా ఎంపికైందట. ఇప్పటికే షారుక్‌ఖాన్‌కు జోడీగా ‘జవాన్’ చిత్రంలో నటించి, బాలీవుడ్లో భారీ విజయాన్ని అందుకున్నది నయనతార. ఇప్పుడామె సల్మాన్‌తో జతకట్టనుండటం బాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సల్మాన్ ‘మాతృభూమి’ అనే సినిమా చేస్తున్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది.