కథాంశాల ఎంపికలో చాలా సెలెక్టివ్‌గా వ్యవహరిస్తుంటుంది అగ్ర కథానాయిక నయనతార. ప్రస్తుతం ఆమె షారుఖ్‌ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్లో నయనతారకిది తొలి చిత్రం. ఇదిలావుండగా నయనతార తమిళ చిత్రసీమలో మరో భారీ సినిమాకు అంగీకరించిందని తెలిసింది. వివరాల్లోకి వెళితే… రాఘవ లారెన్స్ కథానాయకుడిగా తమిళ దర్శకుడు రత్నకుమార్ ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.
హారర్ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఇందులో కథానాయికగా నయనతారను ఖరారు చేశారు. విభిన్నమైన హారర్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమాకు నయనతార వెంటనే ఓకే చెప్పిందని అంటున్నారు. మే నెలలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది.