Nayanthara | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘జవాన్’ (Jawan). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) డైరెక్ట్ చేస్తున్నాడు. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నయనతార తన సినిమాల ప్రమోషన్స్‌కు దూరంగా ఉంటుందని తెలిసిందే. ఏ ఈవెంట్స్‌కు హాజరవడం కానీ, వీడియో ఇంటర్వ్యూల్లో పాల్గొనడం కానీ చేయదు. అయితే ఇన్నాళ్ల కెరీర్లో జవాన్ కోసం ప్రమోషన్స్ బాట పట్టాలని నిర్ణయించుకుందట నయన్.
జవాన్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో మేకర్స్ భారీ ప్రమోషనల్ ప్లాన్ చేయగా.. నయనతార కొన్ని ఈవెంట్స్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి సందడి చేయబోతుందట. మొత్తానికి నయన్ ఇన్నాళ్లకైనా ప్రమోషన్స్‌లో పాల్గొనబోతుందని తెలిసి ఫుల్ ఖుషి అవుతున్నారు అభిమానులు .
ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తుండగా.. ఇప్పటికే విజయ్ సేతుపతి క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ.. DEALER OF DEATH క్యాప్షన్‌తో షేర్ చేసిన లుక్నెట్టింట హల్చల్ చేస్తోంది. జవాన్ టైటిల్ అనౌన్స్మెంట్ టీజర్‌తోపాటు Jawan Prevue సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్ తండ్రి, కొడుకులుగా డ్యుయల్ రోల్లో కనిపించబోతున్నట్టు ఇన్సైడ్ టాక్.
జవాన్‌లో నయనతార ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా మెరువబోతుంది. జవాన్‌లో ప్రియమణి, సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే అతిథి పాత్రలో మెరవనుంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని షారుఖ్ ఖాన్ హోంబ్యానర్ రెడీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గౌరీఖాన్ తెరకెక్కిస్తోంది.
జవాన్ టైటిల్ అనౌన్స్ మెంట్ టీజర్ ..
Jawan Prevue..