“నాయకుడు’ చిత్రం తమిళంలో ‘మామన్నన్’ పేరుతో విడుదలై గొప్ప విజయం సాధించింది. ఈ చిత్రంలో ఓ కామన్ ఎమోషన్ వుంది. ఆ ఎమోషన్ తెలుగు ప్రేక్షకులకు కూడా కనెక్ట్ కావడం గొప్ప ఆనందాన్నిచ్చింది’ అన్నారు కథానాయిక కీర్తిసురేష్. ఆమె తమిళంలో నటించిన చిత్రం ‘మామన్నన్’ ఇటీవల ‘నాయకుడు’ పేరుతో తెలుగులో విడుదలైంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మారి సెల్వరాజ్ గారి దర్శకత్వంలో పనిచేయాలని ప్రతి హీరోయిన్‌కు వుంటుంది. ఆయన కథలో హీరోయిన్ పాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంటుంది. ఈ చిత్రంలో నాది సింపుల్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్. షూటింగ్‌కు గంట ముందు నాకు లుక్ టెస్ట్ చేసి ఫైనల్ చేశారు. ఈ చిత్ర కథ చెప్పినప్పుడు కూడా చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. ఆయన చెప్పిన దాని కంటే నాలుగు రెట్లు బెటర్‌గా సినిమా తీశారు. రెహమాన్ అందించిన సంగీతం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ. ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పనిచేయడం చాలా సరదాగా వుంటుంది’ అన్నారు.