నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. కైలాష్ దుర్గం నిర్మాత. ఈ నెల 17న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన సీనియర్ దర్శకుడు వి.సముద్ర చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చిత్రంలో భాగమైనందుకు కీలక పాత్రలు పోషించిన రాజీవ్ కనకాల, 30ఇయర్స్ పృథ్వీ, నాగమహేశ్, పుష్ప జగదీష్ ఆనందం వ్యక్తం చేశారు.
కథ నచ్చి ఈ సినిమా నిర్మించానని నిర్మాత కైలాష్ దుర్గం చెప్పారు. పనిచేసిన వారంతా ఈ సినిమాకోసం ప్రాణం పెట్టారని దర్శకుడు జార్జ్ అన్నారు. సముద్రతీరాన ఎన్నో రోజులు కష్టపడి, అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని, వారితో కలిసి పోయి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పకుండా అందరూ మెచ్చే సినిమా అవుతుందని హీరో నవీన్‌రాజ్ పేర్కొన్నారు. ఇంకా కథానాయికలు పూజా సుహాసిని, శ్రీలు కూడా మాట్లాడారు.