హిట్ సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తర్వాత నవీన్ పొలిశెట్టి నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘అనగనగా ఒక రాజు’. మీనాక్షి చౌదరి కథానాయిక. మారి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. ఇందులో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను గురువారం మేకర్స్ విడుదల చేశారు. ‘ చాట్ జీపీటీ.. ఎవరే ఈ బ్యూటీ.. ఇంతందంగుందేంటీ హాయ్.. డ్రెస్సులు ఒక్కోటీ వెలకడితే కోటీ.. యే కిస్కీ భేటీ హే భాయ్..’ అంటూ సాగే ఈ పాటను గాయని నూతన మోహన్‌తో కలిసి నవీన్ పొలిశెట్టి స్వయంగా ఆలపించారు.
ప్రొఫెషనల్ సింగర్స్ స్థాయిలో ఈ పాటను నవీన్ పోలిశెట్టి పాడటం విశేషం. చంద్రబోస్ రాయగా, మిక్కీ జె.మేయర్ స్వరపరిచిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట థియేటర్లలో పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జె.యువరాజ్, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, నిర్మాణం: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్.