నవీన్‌చంద్ర, రాశీ సింగ్, కాజల్ చౌదరి హీరోహీరోయిన్లుగా, రాకేష్ పొట్టా దర్శకత్వంలో, మందలపు శివకృష్ణ నిర్మిస్తున్న ‘కరాలి’ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి కెమెరా క్లాప్ కొట్టగా, వ్యాపారవేత్తలు గోరంట్ల రవికుమార్, తుమాటి నరసింహారెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సదర్భంగా అతిథులంతా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ‘కరాలి’ అనే పేరు ఎంత డిఫరెంట్‌గా ఉందో, సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుందని, ఇంతవరకూ చేయని ఓ విభిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నానని, ఇదో డిఫరెంట్ యాక్షన్ డ్రామా అని హీరో నవీన్‌చంద్ర చెప్పారు.
కథను నమ్మి చేస్తున్న సినిమా ఇదని నిర్మాత తెలిపారు. అవకాశం ఇచ్చిన నిర్మాతకు, హీరోకు దర్శకుడు రాకేష్ పొట్టా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నందుకు కథానాయిక కాజల్ చౌదరి ఆనందం వెలిబుచ్చారు. గరుడ రాముడు, రాజారవీంద్ర, వెంకటేశ్ ముమ్మిడి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అపూర్వ అనిల్ శాలిగ్రామ్, సంగీతం: వికాస్ బడిసా, సమర్పణ: మందలపు ప్రవల్లిక, నిర్మాణం: విక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్