Karaali | అందాల రాక్షసి సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ చంద్ర (Naveen Chandra). ఆ తర్వాత ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరోవైపు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నాడు. ఈ టాలెంటెడ్ యాక్టర్ తాజాగా కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. నవీన్‌చంద్ర నటిస్తోన్న కొత్త ప్రాజెక్ట్ కరాళి (Karaali). రాకేశ్ పొట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వింక్రాంత్ ఫిల్మ్ క్రియేషన్స్ బ్యానర్‌పై మండలపు శివకృష్ణ నిర్మిస్తున్నారు.
రాశిసింగ్, కాజల్ చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత సాహు గారపాటి, నటుడు రాజా రవీంద్ర ఈవెంట్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ..కొత్త వ్యక్తులు కొత్త ఆలోచనలతో వస్తే శివ లాంటి వంటి ధైర్యవంతులైన నిర్మాతలు ముందుకు వచ్చి సినిమాలు తీయాలి. ‘కరాలి’ అనే టైటిల్ ప్రత్యేకమైంది. టైటిల్‌లాగే సినిమా కూడా అంతే కొత్తగా ఉంటుంది. నేను ఇంతకు ముందు చేయని విభిన్నమైన యాక్షన్ డ్రామా ఇది.
కాజల్ చౌదరి ఇటీవల నటించిన ‘అనగనగ’ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులు, మీడియా నన్ను ఎప్పుడూ ప్రోత్సహించారు. అందరూ ఆస్వాదించేలా మేము ఈ సినిమా తెరకెక్కిస్తున్నామన్నాడు నవీన్ చంద్ర.
With pride and passion, we launch our Production No.1 #Karaali 🔥
Starring @Naveenc212, @RashiReal_ & #Kajalchaudhary
Directed by #RakeshPotta
Produced by #MandalapuShivakrishnaPooja ceremony held grandly today ✨Special thanks to all our guests for making a huge success ❤️🙏 pic.twitter.com/FOEpF2gfWh
— BA Raju’s Team (@baraju_SuperHit) May 18, 2025
Prabhas Spirit | మెక్సికోలో షూటింగ్.. ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ పంచుకున్న సందీప్ వంగా
Lucifer 2 Empuraan | మోహన్ లాల్ ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాపై 17 సెన్సార్ కట్స్
Pawan Kalyan | ఉగాది రోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చే న్యూస్.. ఇక సమయం లేదు మిత్రమా..!