నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెవెన్’. లోకేష్ అజ్ల్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మాతలు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్న ఈ చిత్ర టీజర్‌ను హీరో నిఖిల్ ట్విట్టర్ ద్వారా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ ‘ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశమిది. ఓ యూనిక్ పాయింట్‌తో తెరకెక్కించాం. పోలీస్ ఆఫీసర్‌గా నవీన్‌చంద్ర అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచారు.
ఆద్యంతం అనూహ్య మలుపులతో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తుంది’ అన్నారు. కథ విన్న వెంటనే సినిమా చేయాలని ఫిక్సై పోయానని, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జోనర్లో ఇదొక కొత్త ప్రయత్నమని హీరో నవీన్‌చంద్ర తెలిపారు. తమిళ. తెలుగు భాషల్లో అద్భుతమైన క్వాలిటీతో ఈ సినిమాను తెరకెక్కించామని, త్వరలో థియేటర్లలో విడుదల చేస్తామని నిర్మాతలు పేర్కొన్నారు. రేయా హరి, శశాంక్, అభిరామి, దిలీపన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ అశోక్, సంగీతం: డి. ఇమ్మాన్, నిర్మాణ సంస్థ: ఏఆర్ ఎంటర్టైన్మెంట్, రచన-దర్శకత్వం: లోకేష్ ఆజ్ల్స్.