Chandrabose| ఆస్కార్ అందుకున్న తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన చంద్రబోస్
ప్రపంచాన్ని ఒక ఊపుఊపిన ‘నాటు నాటు’ పాట (Natu Natu) సినీజగత్తులో అత్యున్నత అవార్డు అయిన ఆస్కార్‌ను (Oscar award) సొంతం చేసుకున్నది. ఈ నెల 13న అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆ పాటను రాసిన సినీగేయరచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్నారు.
హైదరాబాద్: ప్రపంచాన్ని ఒక ఊపుఊపిన ‘నాటు నాటు’ పాట (Natu Natu) సినీజగత్తులో అత్యున్నత అవార్డు అయిన ఆస్కార్‌ను (Oscar award) సొంతం చేసుకున్నది. ఈ నెల 13న అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో ఆ పాటను రాసిన సినీగేయరచయిత చంద్రబోస్ (Chandrabose) ఆస్కార్ అందుకున్నారు. అవార్డు అందుకున్న తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నారు. శంషాబాద్ (Shamshabad) విమానాశ్రయంలో అభిమానులు, సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ఆస్కార్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అవార్డు అందుకోవడానికి వేదికపైకి వెళ్లినప్పుడు తన ఆనందానికి అవదుల్లేవన్నారు. ఆస్కార్ స్టేజ్‌పైన మన తెలుగుపదం నమస్తే తోనే స్పీచ్ ఇచ్చాచని తెలిపారు. నాటు నాటు పాట వెనుక తొమ్మిది నెలల కష్టం ఉందని చెప్పారు. తెలుగు సినిమా, భారతీయ సినిమా ప్రపంచానికి గొప్పగా పరిచయం అయ్యాయని వెల్లడించారు. ఆస్కార్‌తో తన బాధ్యత మరింతగా పెరిగిందన్నారు.
ఈ నెల 17న (శుక్రవారం) తెల్లవారుజామున ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నది. డైరెక్టర్ రాజమౌళి, ఆయన సతీమణి రమ, సంగీత దర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి, కార్తికేయ, కాలభైరవ సహా మొత్తం 14 మంది చిత్ర బృందానికి శంషాబాద్ ఎయిర్ పోర్టులో సినీ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాజమౌళి, కీరవాణితో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులతో ఎయిర్పోర్ట్ జనసందోహంగా మారింది.
#WATCH | Telangana: RRR Director SS Rajamouli and Music composer MM Keeravani reach Rajiv Gandhi International Airport in Hyderabad.
'Naatu Naatu' song from RRR won the #Oscar for the Best Original Song pic.twitter.com/ismDbDAQ3t
— ANI (@ANI) March 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

