ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘నరుడి బ్రతుకు నటన’. శివ కుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న, శృతి జయన్, ఐశ్వర్య అనిల్ కుమార్, వైవా రాఘవ ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. రిషికేశ్వర్ యోగి దర్శకుడు.
‘షూటింగ్ మొత్తం కేరళలో జరిపాం. అక్కడి ప్రకృతి అందాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమా ఇప్పటికే దాదాపు అరవైకి పైగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. మన జీవితంలోని జ్ఞాపకాలను గుర్తుచేసే కథాంశమిది. ప్రేమ, స్నేహం, నవ్వు, బాధ…ఇలా అన్ని భావోద్వేగాలతో ఆకట్టుకుంటుంది. ఈ నెల 26న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నాం’ అన్నారు.