నార్నె నితిన్ హీరోగా నటించిన సినిమా ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’. సంపద కథానాయిక. సతీశ్ వేగేశ్న దర్శకుడు. చింతపల్లి రామారావు నిర్మాత. ఈ నెల 28న విడుదల కానుంది. ‘గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ఇది. ఎన్టీఆర్ ఎంతో మెచ్చి ఈ కథను ఎంపిక చేశారు.
ఆయన అంచనాల మేరకు రాజీపడకుండా దర్శకుడు వేగేశ్న సతీశ్ సినిమాను మలిచారు. ఈ సినిమాతో నార్నె నితిన్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.’ అని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. నరేష్, రావురమేష్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: దాము నర్రావుల, సంగీతం: కైలాష్ మీనన్.