Naresh Agastya | మత్తు వదలరా ఫేం.. టాలీవుడ్ యువ నటుడు నరేష్ అగస్త్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మేఘాలు చెప్పిన ప్రేమ కథ’ (Meghalu Cheppina Prema Katha). ఈ సినిమాకు విపిన్ దర్శకత్వం వహిస్తుండగా.. ఆగష్టు 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా లవ్ కమ్ మ్యూజికల్ బ్యాక్డ్రాప్లో రాబోతుంది. తన అమ్మమ్మ కన్న కలలను మనవడు నేరవేర్చడానికి ఏం చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఉమా దేవి కోటా నిర్మించిన ఈ చిత్రానికి మోహనా కృష్ణ అద్భుతమైన విజువల్స్ అందించగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చారు. రబియా ఖాటూన్ కథానాయికగా నటిస్తుండగా.. రాధికా శరత్ కుమార్, విరాజిత, తులసి, సుమన్, తనికెళ్ల భరణి, ఆమని వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.