ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ ‘మా వందే’. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ ఇందులో నరేంద్రమోదీగా నటించనున్నారు. క్రాంతికుమార్ సీహెచ్ దర్శకుడు. వీర్రెడ్డి ఎం. నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం శనివారం లాంఛనంగా జరిగింది. శనివారం నుంచే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా మొదలుపెడుతున్నట్టు మేకర్స్ తెలిపారు.
పోరాటాలకన్నా తల్లి సంకల్పం గొప్పదనే సందేశాన్నిస్తూ, నరేంద్రమోదీ జీవితంలోని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని, ప్రధాని మోదీ వ్యక్తిగత, రాజకీయ జీవితాల్లోని విశేషాలన్నీ ఎంతో సహజంగా ఈ సినిమాలో చూపించబోతున్నామని దర్శకుడు తెలిపారు. పానిండియా భాషలతోపాటు ఇంగ్లిష్‌లోనూ విడుదల చేయనున్న ఈ చిత్రంలో రవీనా టాండన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కె.కె.సెంథిల్‌కుమార్, సంగీతం: రవి బస్రూర్, నిర్మాణం: సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్.