నరేన్తేజ్, సుహాన జంటగా నటిస్తున్న చిత్రం ‘వైఫ్’. శ్రీనివాస్ (బుజ్జి) దర్శకత్వంలో అధిరా టాకీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఇటీవలే టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను సీనియర్ దర్శకుడు సముద్ర లాంచ్ చేశారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథలోని మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తాయని, ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తయిందని దర్శకుడు తెలిపారు.
వినూత్న కథా చిత్రంలో నటిస్తుండటం పట్ల నాయకానాయికలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: మురళీకృష్ణ వర్మ, సంగీతం: సత్య కశ్యప్, దర్శకత్వం: శ్రీనివాస్ (బుజ్జి).