Navadeep | మదాపూర్ డ్రగ్స్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. టాలీవుడ్ నటుడు నవదీప్‌కు నార్కోటిక్ బ్యూరో అధికారులు నోటీసులు జారీ చేశారు. 41 కింద నోటీసులు ఇచ్చిన అధికారులు ఈ నెల 23న హెచ్‌న్యూ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఆదేశించారు. మాదాపూర్ డ్రగ్స్‌లో నవదీప్ ఏ-29గా చేర్చిన విషయం తెలిసిందే.
నవదీప్ తన స్నేహితుడో రాంచంద్‌తో కలిసి డ్రగ్స్‌ను తీసుకున్నట్లు ఆరోపనలున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే అధికారులు రాంచంద్‌ను అరెస్టు చేశారు. అయితే, డ్రగ్స్ కేసులో నవదీప్ తెలంగాణ కోర్టును ఆశ్రయించాడు. అయితే, 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. గత నెల 31న మాదాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్మెంట్లోని ఓ ప్లాట్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది.
పక్కా సమాచారం అధికారులు ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ఇందులో నైజీరియన్లతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు సైతం పట్టుబడ్డారు. ఈ వ్యవహారంలో చిక్కిన రాంచంద్‌ను విచారించగా.. హీరో నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. నవదీప్ సైతం తనతో కలిసి మాదకద్రవ్యాలు సేవించినట్లుగా అతడు వాంగ్మూలం ఇచ్చాడు. ఈ క్రమంలో నవదీప్‌ను సైతం నిందితుడిగా చేర్చి.. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసం నోటీసులు జారీ చేశారు.