Nara Rohit | చాలా రోజుల తర్వాత నారా రోహిత్ భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో నారా రోహిత్‌తో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మే 30న ఈ చిత్రం విడుదల కానుండగా, గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు ముగ్గురు హీరోలు. అయితే ఇటీవల నారా రోహిత్‌కి కాబోయే భార్య సిరి.. పవన్ నటిస్తున్న ఓజీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుందంటూ జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందనే దానిపై క్లారిటీ లేదు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అచ్చ తెలుగమ్మాయి అయిన సిరి లేళ్ల విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి నటనపై మక్కువతో ఇండియాకు తిరిగొచ్చేసింది. హైదరాబాద్‌లో తన అక్క ఇంట్లో ఉంటూ మోడలింగ్ చేస్తూనే ఆడిషన్స్‌కు హాజరయ్యేది. అలా ఆమెకు ‘ప్రతినిధి 2’లో అవకాశం రాగా, అందులో నారా రోహిత్ సరసన నటించి పేరు తెచ్చుకుంది. అంతేకాదు తన తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు హీరో నారా రోహిత్ మనసు గెలుచుకుంది ఈ చిన్నది . త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్దమైపోయింది. ఇటీవల నారా రోహిత్ తండ్రి చనిపోవడంతో పెళ్లి ఆలస్యం అవుతుంది. లేదంటే ఎప్పుడో వీరిద్దరి వివాహం అయిపోయి ఉండేది.
అయితే ప్రతినిధి 2 తర్వాత సిరి సినిమాలలో కనిపించింది లేదు. ఇప్పుడు ఏకంగా పవన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లు వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో క్లారిటీ ఏంటనే విషయం గురించి సాయి ధరమ్ తేజ్ డైరెక్ట్‌గా నారా రోహిత్ ని అడిగాడు. భైరవం ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్ అంతా కలిసి సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తో సందడి చేశారు. సరదా సిట్టింగ్ పేరుతో జరిగిన ఇంటర్వ్యూలో నారా రోహిత్ ను సాయి దుర్గ తేజ్ ఓజీ అప్డేట్ ఇవ్వమని అడిగారు. వెంటనే మనోజ్.. ఆయనను అడుగుతావేంటి.. నీవే చెప్పాలి కదా అన్నారు. అప్పుడు నారా రోహిత్.. సినిమాలో తనకు కాబోయే భార్య శిరీష నటించినట్లు తెలపడంతో మనోజ్ కూడా షాక్ అయ్యాడు. నాకు కూడా చెప్పలేదుగా అంటూ రోహిత్‌ని ఆటపట్టించారు మనోజ్. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఓజీ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు నారా వారి కాబోయే కోడలు.