Nara Rohit- Siri | ఇటీవల భైరవం సినిమాతో తెలుగు ప్రేక్షకల ముందుకు వచ్చాడు నారా రోహిత్. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నారా రోహిత్ పర్ఫార్మెన్స్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. నారా రోహిత్.. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో భైరవం మూవీని తనకు కాబోయే భార్య శిరీష (సిరి)తో కలిసి చూశారు. సినిమా అయ్యాక.. అనేక మంది వచ్చి నారా రోహిత్ ను కలిసి యాక్షన్ అదరగొట్టేశారంటూ ప్రశంసించారు. ఆ సమయంలో రోహిత్ పక్కన ఉన్న సిరి చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపించింది.
నారా రోహిత్, సిరిల నిశ్చితార్థం జరిగి 6 నెలలు కావస్తున్నా.. పెళ్లి విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎప్పుడో పెళ్లి కావల్సి ఉన్నా రోహిత్ తండ్రి మరణించడంతో వాయిదా పడింది. అయితే ఇప్పుడు నారా రోహిత్ గుడ్ న్యూస్ చెప్పాడు.ఈ ఏడాది అక్టోబర్‌లో సిరితో తన పెళ్లి కాబోతున్నట్టు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం తమ వివాహం ఉంటుందని పేర్కొన్నాడు. దీంతో నారా రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా, ఏపీకి చెందిన సిరి.. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ పూర్తి చేసి కొంతకాలం పాటు అక్కడ జాబ్ చేసి నటనపై మక్కువతో ఇండియా వచ్చింది.
హైదరాబాద్‌లో మోడలింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మ సినిమా ఆడిషన్స్ హాజరై ప్రతినిధి-2 మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యారు. ఆ సినిమాలో నటించిన రోహిత్‌తో ప్రేమలో పడి ఇప్పుడు అతడిని వివాహం చేసుకోబోతుంది. గత ఏడాది అక్టోబర్ 14వ తేదీన హైదరాబాద్ లో ఎంగేజ్మెంట్ జరిగింది. అతిరథ మహారథుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు రోహిత్, సిరి. మళ్లీ అక్టోబర్‌లోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధయ్యారు. మరోవైపు సిరి.. చాలా రోజుల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించబోతుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది.