Sundara Kanda | టాలీవుడ్ హీరో నారా రోహిత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాణం అంటూ తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సోలో, రౌడి ఫెలో, ప్రతినిధి అంటూ తనకంటూ సెపరేట్ స్టార్డమ్ తెచ్చుకున్నాడు ఈ కుర్ర హీరో. అయితే నారా రోహిత్‌కు సినిమాలకు సంబంధించి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే మాత్రమే రోహిత్ సినిమాలు చేస్తాడు. చంద్రబాబు అధికారంలో లేకుంటే సినిమాలు చేయడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో ఎప్పటినుంచో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై స్పందించాడు నారా రోహిత్.
నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘సుందరకాండ’ (Sundara Kanda). వృతి వాఘని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. సందీప్ పిక్చర్ ప్యాలస్ పతాకంపై సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 06న ప్రేక్షకుల విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా టీజర్ వేడుకను హైదరాబాద్‌లో నేడు నిర్వహించారు.
అయితే ఈ వేడుకలో రోహిత్ సినిమాల గురించి మహిళ రిపోర్టర్ అడుగుతూ.. నారా రోహిత్ అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న టైంలో మాత్రమే సినిమాలు చేస్తాడు అనే టాక్ ఉంది దీనిపై మీరు ఏమంటారు అని అడుగగా.. రోహిత్ సమాధానమిస్తూ.. మొదటగా సుందరకాండ నిర్మాతలు సంతోష్ చిన్నపోళ్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏ ప్రభుత్యం వస్తుందో ముందే తెలుసుకున్నందుకు వారికి ధన్యవాదాలు. ప్రభుత్యం ఏర్పడకముందే సినిమాను మొదలుపెట్టారు అంటూ చెప్పుకోచ్చాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Dheenamma em feel undi mama ikkada#NaraRohit was bang on 😭😂😂🤣🤣
Phat phat phat ani ichipadesadu media ki
1.30 of back to back punches, entertainment!!!TDP govt unnappude movies chestaru annadhaniki and chala evariki navvuthu ichipadesadu😭😂#Sundarakanda @nara_rohith pic.twitter.com/hMJBIsToDb
— Vamc Krishna (@lyf_a_zindagii) August 26, 2024