Tuck Jagadish |హీరో నానికి ఎంత మార్కెట్ ఉంది..? దీనికి సమాధానం దాదాపు 30 కోట్లు అని వస్తుంది. ఈయన సినిమాలు విజయం సాధిస్తే కచ్చితంగా 30 నుంచి 35 కోట్ల మధ్యలో షేర్ వసూలు చేస్తాయి. నాలుగేళ్ల కిందే ఎంసీఏ సినిమాతో 40 కోట్ల మార్క్ అందుకున్నాడు నాని. అయితే అప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పటి పరిస్థితులు వేరు. అందుకే ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా విజయం సాధిస్తే రూ.30 కోట్ల మార్క్ అందుకోవడం కష్టమే. నాని లాంటి హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 30 కోట్లు రావడం కష్టమేం కాదు. కానీ ఇప్పుడు ఈయన నటించిన టక్ జగదీష్ సినిమాను ఓటీటీకే అమ్మేశారనే వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియోతో మాటామంతి కూడా పూర్తయిపోయాయి కేవలం సంతకాలు పెట్టడం మాత్రమే తరువాయి అనే వార్తలొస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు థియేటర్స్ అని కూర్చున్న నిర్మాతలు ఎందుకు మాట తప్పారు.. ఇంతకీ అమెజాన్ ఎంత అమౌంట్ ఆఫర్ చేసిందని ఇప్పుడు అంతా ఆలోచిస్తున్నారు. అయితే ఈ సినిమాకు దాదాపు రూ.37 కోట్ల వరకు డీల్ జరిగిందని తెలుస్తోంది. అది కూడా కేవలం ఓటీటీకి మాత్రమే. అందులో డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ లేవు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాని సినిమా ఒకవేళ థియేటర్లలో విడుదలై విజయం సాధించినా కూడా రూ.37 కోట్లు వసూలు చేయడం దాదాపు అసాధ్యమే. అందుకే నిర్మాతలు కూడా ఈ రేటుకే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ చిత్ర బడ్జెట్ రూ.20కోట్లలోపే.. అయినా కూడా రెండు కరోనా సీజన్స్ సినిమాకు అడ్డుతగిలాయి. దీంతో వడ్డీలు కూడా భారీగానే పెరిగిపోయాయి. అంటే బడ్జెట్ కూడా పెరిగిందన్నట్టే. ఈ లెక్కన చూసుకుంటే స్వల్ప లాభాలకే టక్ జగదీష్ సినిమాను ఓటీటీకి ఇచ్చారనుకోవచ్చు. మరోవైపు శాటిలైట్, డబ్బింగ్ అన్నీ కలిపి మరో రూ.12 కోట్ల వరకు వస్తున్నాయి. మొత్తంగా టక్ జగదీష్ ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్ల వరకు జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకంటే బెటర్ ఆఫర్ రాదని నిర్ణయించుకున్న తర్వాతే.. నానికి ఇష్టం లేకపోయినా కూడా ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నారు టక్ జగదీష్ నిర్మాతలు. అన్నీ కుదిరితే సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియోస్‌లో చూడొచ్చు. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రంలో రితూ వర్మ హీరోయిన్గా నటించింది. మజిలీ సినిమాను నిర్మించిన షైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై హరీష్ పెద్ది, సాహు గరపాటి టక్ జగదీష్‌ను నిర్మించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shanmukh Jaswanth |బిగ్ బాస్ 5 లో అత్యధిక రెమ్యునరేషన్ ఈ యూట్యూబ్ స్టార్కేనా?
నేను చచ్చిపోయుంటే బాగుండేది.. అనవసరంగా బతికున్నా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తన భర్త నచ్చిన ప్లేస్‌లో ఉన్నాడని చెప్పిన ప్రియాంక
బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖా ఏం చెప్పిందంటే..!
సాహసం చేస్తున్న తమన్నా.. అభినందించాల్సిందే అంటున్న నెటిజన్స్