తన భర్త నచ్చిన ప్లేస్‌లో ఉన్నాడని చెప్పిన ప్రియాంక

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లు, సీరియల్లు ఇలా క్షణం కూడా తీరిక లేకుండా గడుపుతుంది. ఆమె బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌ని ఏలేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
రీసెంట్గా తన పదో తరగతిలో బాయ్ ఫ్రెండ్‌తో చేసిన చిలిపి పనులు చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది ప్రియాంక. అయితే ఈ ముద్దుగుమ్మ తనకన్నా పదేళ్ల చిన్న వాడైన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, ఆయనతో పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తుండడం హాట్ టాపిక్గామారుతుంటుంది. వీరిద్దరు కెమెరా ముందు ఎన్నో సార్లు విరహ వేదన తీర్చుకున్నారు.
వీలున్నప్పుడల్లా తన భర్తకు సంబంధించిన పోస్ట్‌లు పెడుతూ నెటిజన్స్‌ని ఎంటర్ టైన్ చేస్తున్న ప్రియాంక తాజాగా తన భర్త నిక్‌తో దిగిన రొమాంటిక్ ఫొటోను సోషల్ మీడియా ఖాతా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి షాకిచ్చింది. ఇందులో నిక్ ఆమె హృదయంపై సేద తీరుతుండగా, ఆ ఫోటోకి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. అతడు తనకిష్టమైన ప్రదేశంలో ఉన్నాడు అని తెలిపింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ఈ రొమాంటిక్ ఫొటోకు తోడుగా ‘అతడు తనకిష్టమైన ప్రదేశంలో ఉన్నాడు’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చి భర్తపై ప్రేమ కురిపించింది. ఇలా తన హృదయంలో భర్తకు పదిలమైన చోటు ఉందంటూ పరోక్షంగా చెప్పింది. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్ కావడంతో పాటు నెటిజన్ల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Marco Rubio | అమెరికాలోనూ నిత్యం నిరసనలు జరుగుతాయ్.. భారత్‌లో నిరసనలపై మార్కో రూబియో
woman kills twin sons | ప్రియుడు అంగీకరించలేదని.. కవల కుమారులను చంపిన మహిళ
కోట మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
బంగారు ఆభరణాల కోసం వృద్ధురాలి హత్య
MLC Botsa | ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదు..కేంద్రబలగాలను రప్పించాలి : ఎమ్మెల్సీ బొత్స
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

