Shanmukh Jaswanth |బిగ్ బాస్ 5 లో అత్యధిక రెమ్యునరేషన్ ఈ యూట్యూబ్ స్టార్కేనా?
Shanmukh Jaswanth | హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫాలోయింగ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సొంతం. మనోడి వీడియో రిలీజ్ అయిందంటే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయాల్సిందే.

Shanmukh Jaswanth | హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఫాలోయింగ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ సొంతం. మనోడి వీడియో రిలీజ్ అయిందంటే యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేయాల్సిందే. ఈయన నటించిన సాఫ్ట్వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్‌లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. వీటి ఎపిసోడ్లు రిలీజైన గంటల్లోనే ట్రెండింగ్‌లో నిలిచేవి. దీంతో షణ్ముఖ్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. ఈ క్రేజ్‌తో ఇప్పుడు షణ్ముఖ్‌కు సినిమా ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే బిగ్‌బాస్ ఆఫర్ కూడా షణ్ముఖ్ చెంతకు వచ్చింది. ఇందులో పాల్గొనేందుకు ఈ యూట్యూబ్ స్టార్ పెద్ద మొత్తమే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
బిగ్‌బాస్ ఆఫర్‌ను కరెక్టుగా వాడుకోవాలని చూస్తున్నాడు షణ్ముఖ్. తనకు ఉన్న ఫాలోయింగ్‌ను లెక్కేసుకుని భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈయన అడిగిన మొత్తం విని ముందుగా షాకైన బిగ్‌బాస్ నిర్వాహకులు కూడా.. తమకు వచ్చే లాభాలు, షణ్ముఖ్ బిగ్‌బాస్ హౌస్‌లో ఉంటే వచ్చే టీఆర్పీ రేటింగ్ అన్నీ బేరీజు వేసుకుని అడిగినంత ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఏ యూట్యూబ్ స్టార్‌కు ఇవ్వనంత పారితోషికం మాత్రం షణ్ముఖ్‌కు బిగ్‌బాస్ నిర్వాహకులు ఇస్తున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ అమౌంట్ లక్షల్లోనే కాదు.. కోటి వరకు ఉండొచ్చని కూడా అంటున్నారు. ఇప్పటివరకు శ్రీముఖి మాత్రమే కోటి రూపాయల వరకు పారితోషికం అందుకుంది. బయట ఆమెకు ఉన్న ఫాలోయింగ్ చూసి నిర్వాహకులు అడిగినంత ఇచ్చారు. ఇప్పుడు షణ్ముఖ్ కూడా ఇదే స్థాయిలో ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాంతో ఈయనకు కూడా భారీగానే పారితోషికం అందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
పైగా షణ్ముఖ్ వస్తే బిగ్ బాస్ 5 తెలుగుకు మరింత రీచ్ పెరుగుతుందని మా టీవీ యాజమాన్యం గట్టిగా నమ్ముతుంది. అందుకే షణ్నును వదులుకోవద్దని ఫిక్సయ్యారు. ఇప్పటికే షణ్ముఖ్ ప్రోమో కూడా రెడీ అయిపోయిందని తెలుస్తోంది. సెప్టెంబర్ మొదటివారంలో బిగ్‌బాస్ 5 తెలుగు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
నేను చచ్చిపోయుంటే బాగుండేది.. అనవసరంగా బతికున్నా.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
తన భర్త నచ్చిన ప్లేస్‌లో ఉన్నాడని చెప్పిన ప్రియాంక
బిగ్ బాస్ ఎంట్రీపై సురేఖా ఏం చెప్పిందంటే..!
సాహసం చేస్తున్న తమన్నా.. అభినందించాల్సిందే అంటున్న నెటిజన్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

