కథానాయకుడు నాని 17 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఇందులో నాని కండలు తిరిగిన దేహంతో బీస్ట్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ‘ది ప్యారడైజ్’ చిత్రంలో నాని జడల్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. రెండు జడలు, గుబురు గడ్డం, మీసాలతో కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన నాని లుక్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా లుక్ కూడా ఆయన పాత్రపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటున్నది. హైదరాబాద్-సికింద్రాబాద్ నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి కెమెరా: సి.హెచ్.సాయి, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, రచన-దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల.