NANI| ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన వారిలో నాని కూడా ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగారు. మరోవైపు నిర్మాతగా కూడా మంచి సినిమాలు తీస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తున్నాడు అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీ వారు నానిని ప్రశంసిస్తున్నారు. అయితే నాని నిర్మాణంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో రూపొందిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మూవీ టీమ్ తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేయగా, ఇందులో చిరంజీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
నాగచైతన్య పెళ్లికి వెళ్లినప్పుడు, నేను కారు దిగి మండపం వైపు వెళ్తుంటే చిరంజీవి గారు నాకు ఎదురు పడ్డారు. అప్పుడు ప్రొడ్యూసర్ గారు బాగున్నారా? అని కుశల ప్రశ్నలు వేసారు. ఆ సమయంలో నేను నా వెనుక అశ్వినీదత్ గారి లాంటి గొప్ప నిర్మాతలు ఉన్నారా అని చూసా.. ఎవ్వరూ లేరు. చిరంజీవి గారు చిరునవ్వుతో మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు అంటూ నన్ను హగ్ చేసుకున్నారు. ఆ మాట విని ఆశ్చర్యపోయాను అని నాని అప్పటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ, చిరంజీవి ‘కోర్ట్’ సినిమా పోస్టర్ చూసి నన్ను అభినందించారు. నువ్వు సూట్ వేసుకున్న పోస్టర్ నేను చూశాను. చాలా బాగున్నావ్.. నాని నిర్మాత కాబట్టి సినిమా హిట్ అవుతుందిలే అని చిరంజీవి చెప్పారని, అలా ఆ రోజు ధైర్యంగా చెప్పిన మాటలు తనలో ఎంతో సంతోషాన్ని నింపాయని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. కాగా, చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాకి నాని సమర్పకుడిగా ఉన్న విషయం తెలిసిందే. చిరంజీవి మొదటి నుంచి నానిని అభినందిస్తూ ఆయనకి తనవంతూ సపోర్ట్ అందిస్తున్నారు. చిరంజీవి-నాని మధ్య మంచి రిలేషన్ షిప్ ఉంది..