Saripodhaa Sanivaaram | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా నేడు ఏర్పాటు చేసిన ఈవెంట్లో మేకర్స్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
నాని నుంచి అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్ర పోషిస్తున్నాడు. జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజ్ కానుంది.
Puri Jagannadh | పూరీ-రామ్ మాస్ బరాత్ షురూ అయింది రో.. డబుల్ ఇస్మార్ట్ బుకింగ్స్ టైం
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ
Committee Kurrollu | యదువంశీ కథకు జీవం పోశాడు.. కమిటీ కుర్రోళ్లు మూవీపై రాంచరణ్