Saripodhaa Sanivaaram | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీని ఆగస్టు 29న విడుదల చేస్తున్న నేపథ్యంలో నాని అండ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ రానే వచ్చింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆగస్టు 24న గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఇంతకీ ఈవెంట్‌కు ఎవరు ముఖ్యఅతిథిగా వస్తున్నారనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశారు మేకర్స్. ఆఫీసులో నాని.. కానిస్టేబుల్‌గా డ్యూటీలో ప్రియాంకా మోహన్ చాట్‌లో ఉన్న స్టిల్స్ చేశారు మేకర్స్. చాట్‌లో సూర్య : హాయ్ స్కూటీ పెప్ అని మెసేజ్ పెడితే.. చారు : హాయ్ బాటిల్ క్యాప్ అని రిప్లై ఇచ్చింది. సూర్య 4:05 ? అని పెట్టగా.. చారు 4:05 ఒకే అంటూ రిప్లై ఇచ్చింది. ఈ ఇద్దరూ సాయంత్రం కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చాట్‌తో క్లారిటీ ఇచ్చేశారు. మొత్తానికి కానిస్టేబుల్‌కు, నానికి మధ్య ఎలాంటి ట్రాక్ నడించిందనేది సస్పెన్స్‌లో పెడుతూ రిలీజ్ చేసిన స్టిల్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీ ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది.
#SaripodhaaSanivaaram Pre Release Event on AUGUST 24th 🔥🔥🔥🔥#PotharuMothamPotharu ❤️🔥❤️🔥❤️🔥#SaripodhaaSanivaaram @NameisNani pic.twitter.com/q43ayHyPgk
— BA Raju’s Team (@baraju_SuperHit) August 21, 2024
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్
Mahesh Babu | ముఫాసా: ది లయన్ కింగ్‌కు మహేశ్ బాబు వాయిస్ ఓవర్.. ఇంతకీ ఏ పాత్రకో తెలుసా..?