బ్లాక్‌బస్టర్ ‘దసరా’ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ది పారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 21న ప్రారంభమైంది. హీరో నాని మాత్రం శనివారం సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ధగడ్ ఆగయా!’ అంటూ అమెజింగ్ అనౌన్స్‌మెంట్‌తో ఓ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బరువైన బార్బెల్ వెయిట్స్‌పై నాని కాలు మాత్రమే కనిపించేలా ఈ పోస్టర్ని డిజైన్ చేశారు.
‘ఈసారి నాని మరింత ఫెరోషియస్‌గా వస్తున్నాడు..’ అనే క్యాప్షన్ కూడా జత చేశారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన భారీ సెట్లో 40రోజుల భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశామని, ఇప్పటికే వారం పాటు సాగిన షూటింగ్లో చైల్డ్‌వుడ్ సన్నివేశాలను చిత్రీకరించామని, శనివారం నుంచి నానితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా పవర్ఫుల్ సన్నివేశాల చిత్రీకరణ మొదలైందని, వచ్చే ఏడాది మార్చి 26న ‘ది పారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, నిర్మాణం: ఎస్ఎల్వీ సినిమాస్.