టాలీవుడ్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాంబినేషన్లు షూరు అవుతుండటం పరిపాటే. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాని నటించనున్నట్టు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కెర్లు కొడుతున్నది. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల ‘కుబేర’ సినిమాతో బిజీగా ఉన్నారు. ధనుష్ హీరోగా, నాగార్జున ప్రత్యేకపాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
సాధారణంగా ఓ సినిమా చేస్తున్నప్పుడు శేఖర్‌కమ్ముల మరో సినిమాపై దృష్టి పెట్టరు. అయితే.. శేఖర్ తన పంథా మార్చారని, ఏకకాలంలో రెండుమూడు కథల్ని సిద్ధం చేస్తున్నారని, ఈ క్రమంలోనే ఆయన నానికోసం కథ రెడీ చేసినట్టు సమాచారం.
నాని కూడా శేఖర్ దర్శకత్వంలో నటించేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తే బావుంటుందని శేఖర్‌కమ్ముల భావిస్తున్నట్టు వినికిడి. శేఖర్‌కమ్ములతో ఇప్పటికే సాయిపల్లవి రెండు సినిమాలు చేసింది. అలాగే నానితో ఎంసీఏ, శ్యాంసింగరాయ్ సినిమాలు చేసింది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. నాని, శేఖర్‌కమ్ములతో సాయిపల్లవి పనిచేసే మూడో సినిమా ఇదే అవుతుంది.