Saripodhaa Sanivaaram | నాని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకుడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. శనివారం నాని జన్మదినం సందర్భంగా టీజర్‌ను విడుదల చేశారు. ఎస్.జే.సూర్య వాయిస్‌తో టీజర్ మొదలైంది. కోపాన్ని ఓ క్రమపద్ధతిలో వాడుకునే వ్యక్తిగా నాని పాత్రను పరిచయం చేశారు. ‘నా పేరు సూర్య. కోపం చూపిచడానికి ఒక్కరోజు చాలు’ అంటూ నాని చెప్పిన డైలాగ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
కేవలం శనివారాల్లో మాత్రమే తన శత్రువును వేటాడే పాత్రలో నాని పవర్‌ఫుల్‌గా కనిపించారు. రగ్గ్డ్ లుక్‌లో మాస్ అవతారంలో ఆకట్టుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.