‘నానితో సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్‌కి టెన్షన్ ఉండదు’. ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత డీవీవీ దానయ్య అన్నమాట ఇది. నిజమే.. కథను ఓకే చేయడం.. షూటింగ్ టైమ్‌లో ప్రతీది దగ్గరుండి చూసుకోవడం.. ప్రమోషన్లో అన్నీ తానై సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లడం.. నిజానికి ఇంత ఇన్వాల్వ్ అయ్యే హీరోలు ఇండస్ట్రీలో అరుదే. అందుకే నిర్మాతలకు నాని నిజంగా స్పెషల్. ఆయన ‘సరిపోదా శనివారం’ సినిమా రేపు (గురువారం) విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో నాని ముచ్చటించారు.
ఆ మూడ్‌నే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సూర్య, దయ, చారులత.. ఈ ముగ్గురు మధ్య సాగే కథ ఇది. ఈ ముగ్గరికీ సోకులపాలెం అనే ఊరికి ఉన్న సంబంధం ఏమిటి? అనేది ఇందులో ఆసక్తికరమైన అంశం. స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధాన బలం. జనరల్‌గా నా సినిమాలన్నింటిలో తెలియని ఓ బరువును మోస్తుంటా. ఈ సారి మాత్రం ఆ బరువును ఎస్.జె.సూర్య, దర్శకుడు వివేక్ ఆత్రేయ మీద వేసేశా. నేను కొంచెం బ్యాక్ సీట్ తీసుకున్నా.