న్యాచురల్ స్టార్ నాని (Nani) అతి త్వరలోనే దసరా (Dasara) సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. పక్కా మాస్ ఎంటర్టైనర్గా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. కాగా ఇప్పుడు మూవీ లవర్స్, నాని అభిమానుల కోసం అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. దసరా ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 3:33 గంటలకు లక్నోలోని (ఉత్తరప్రదేశ్) ప్రతిభ థియేటర్లో గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు తెలియజేశారు.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో దసరా టీం మెంబర్స్ అంతా పాల్గొనబోతున్నట్టు టాక్. దసరా చిత్రంలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, సముద్రఖని, జరీనా వహబ్, దీక్షిత్ శెట్టి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇప్పటికే నాని టీం ఫుల్ బిజీగా ఉంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మూడు పాటలు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తున్నాయి. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
దసరా ట్రైలర్ అప్డేట్..
#DasaraTrailer Launch at Nawabo Ka Shahar 🤩❤️🔥
Massive launch event at Pratibha Theatre, Lucknow on 14th March from 3:33 PM onwards 💥🔥#Dasara #DasaraOnMarch30th
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/AKFYhXLcfq— SLV Cinemas (@SLVCinemasOffl) March 13, 2023
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే లిరికల్ వీడియో సాంగ్