Dasara | టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటించిన పక్కా మాస్ ఎంటర్టైనర్ దసరా (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో దసరా మేనియా కొనసాగుతోంది.ఇప్పటికే దసరా రూ.100 కోట్ల క్లబ్‌లోకి కూడా ఎంటరైంది.
కాగా ఇప్పుడు నైజాంలో దసరా ఎంత వసూళ్లు చేసిందనే అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. దసరా 10వ రోజున నైజాంలో రూ.75 లక్షలు రాబట్టిందని ట్రేడ్ సర్కిల్ టాక్. దీంతో మొత్తం 10 రోజుల నైజాం షేర్ రూ.23.69 కోట్లకు చేరింది. త్వరలోనే దసరా నైజాంలో రూ.25 కోట్ల షేర్ మార్క్ చేరుకోవడం పక్కా అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దసరా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. దసరాలో నేషనల్ అవార్డు విన్నింగ్ బ్యూటీ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
దసరాలో సాయికుమార్, సముద్రఖని, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి తెరకెక్కించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
దసరా ట్రైలర్..
దసరా టీజర్..
ఛమ్కీలా అంగీలేసి ఓ వదినే లిరికల్ వీడియో సాంగ్
ఓ అమ్మలాలో అమ్మలాలో సాంగ్..
MalaikottaiVaaliban | ప్రీ లుక్‌తో మోహన్ లాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ అప్డేట్
Karthik Ghattamaneni | పుకార్లకు చెక్ పెట్టిన రవితేజ డైరెక్టర్..
Mrunal Thakur | చాలా ఎక్జయిటింగ్‌గా ఉందంటోన్న మృణాళ్ ఠాకూర్