Nani | టాలీవుడ్ యాక్టర్ నాని (Nani) నటిస్తోన్న చిత్రం సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 29న గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నాని అభిమానుల హంగామా షురూ అయింది.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్ వద్ద నాని భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. చేతికి పై భాగంలో దట్టి.. చేతిలో ఈలపీట పట్టుకొని ఊరమాస్ అవతార్‌లో కనిపిస్తున్ నాని భారీ కటౌట్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోంది. ఇప్పుడీ కటౌట్ స్టిల్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రం ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో విడుదలవుతోంది.
యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న సరిపోదా శనివారంలో ఈ చిత్రంలో గ్యాంగ్‌లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య తెరకెక్కించారు. యూఎస్ఏలో సరిపోదా శనివారం ప్రీమియర్ షోల కోసం ప్రీ సేల్స్ ఇప్పటికే రూ.కోటి 67 లక్షలకుపైగా కలెక్షన్ మార్క్‌ను అధిగమించి.. నాని మేనియా ఏంటో చెప్పకనే చెబుతోంది.
#SaripodhaaSanivaaram fever is taking over 🔥
A huge cutout has been erected at Sudarshan 35MM ❤️🔥
All set for Massive Celebrations in theatres from August 29th 💥https://t.co/PDUNdFgyWS#PotharuMothamPotharu
Natural 🌟 @NameIsNani @iam_SJSuryah @priyankaamohan #VivekAthreya… pic.twitter.com/d14vPfGjM6— BA Raju’s Team (@baraju_SuperHit) August 27, 2024
Devara | దేవర మ్యాడ్నెస్.. డిఫరెంట్ షేడ్స్‌లో తారక్ నయా లుక్ అదిరిందంతే..!
Lal Salaam | సస్పెన్స్ వీడింది.. ఫైనల్‌గా ఓటీటీలోకి రజినీకాంత్ లాల్ సలామ్..!
Sikandar | సల్మాన్ ఖాన్ సికిందర్ మారథాన్ షెడ్యూల్ షురూ.. ఎక్కడంటే..?
Game Changer | ఫైనల్‌గా రాంచరణ్ గేమ్‌ఛేంజర్ విడుదల తేదీపై క్లారిటీ.. ఎప్పుడో తెలుసా..?