అతిధి పాత్రలు చేయడం చిరంజీవికి కొత్తేం కాదు. త్రిమూర్తులు, మాపిైళ్లె(తమిళం), ‘సిపాయి’(కన్నడం), ైస్టెల్, మగధీర, బ్లూస్లీ ఇలా చాలా సినిమాలున్నాయి. మరీ ముఖ్యంగా అభిమాని కోరికను కాదనలేని అశక్తత చిరంజీవిది. ఆ కారణంగానే కొన్ని సినిమాల్లో క్యామియో రోల్స్ చేశారాయన. త్వరలో మరో సినిమాలో మెగాస్టార్ అతిథిగా కనిపించనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకెళ్తే.. నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘ది ప్యారడైజ్’కి మెగా మ్యానియా ఉపయోగపడేలా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఓ సన్నివేశాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారట. ప్రస్తుతం చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్‌గారు’ షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా తర్వాత ఆయన చేసేది శ్రీకాంత్ ఓదెల సినిమానే. పైగా ఆ సినిమాను నాని నిర్మాత. ఈ కాంబినేషన్ ఎలాగూ కుదిరింది కాబట్టి, ప్రస్తుతం నాని, శ్రీకాంత్ చేస్తున్న ‘ప్యారడైజ్’లో ఓ క్యామియో అడిగితే.. చిరంజీవి కాదనరని ‘ది ప్యారడైజ్’ టీమ్ భావిస్తున్నారట. త్వరలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నానీ ఆ సన్నివేశాన్ని వినిపించేందుకు చిరంజీవిని కలవనున్నారట. నాని, శ్రీకాంత్‌ల ప్లాన్ వర్కవుట్ అయితే.. ‘ది ప్యారడైజ్’కి దశ తిరిగినట్టే.