Ante Sundaraniki | ఫలితం ఎలా ఉన్న కంటెంట్ ఉన్న కథలను ఎంచుకోవడంలో నాని ముందు వరుసలో ఉంటాడు. ఏడాదికి కనీసం రెండు సినిమాలనైనా విడుదల చేస్తూ సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు. నాని సినిమా వస్తుందంటే ప్రేక్షకులు కూడా మరో ఆలోచన లేకుండా థియేటర్లకు వెళ్తుంటారు. ఎందుకంటే ఈయన సినిమాలు అంత క్లీన్గా ఎలాంటి వల్గారిటీ లేకుండా, ఫ్యామిలీతో కలిసి చూసే విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘అంటే సుందరానికీ’. వివేక్ ఆత్రేయా దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవలే విడుదలైన టీజర్, ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేశాయి. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ప్రమోషన్లు జోరుగా జరుపుతుంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
అంటే సుందరానికీ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ ‘యూ’ సర్టిఫీకేట్ ఇచ్చింది. రన్ టైం 2 గంటల 56 నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో నానికి జోడీగా నజ్రియా హీరోయిన్గా నటించింది. నజ్రియా తెలుగులో నటించిన మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రంలో నాని బ్రహ్మణుడి పాత్రలో నటించగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా నటించింది. మైత్రీ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. నాని ప్రస్తుతం ‘దసరా’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని డీ గ్లామర్ పాత్రలో నటించనున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది. దీనితో పాటు ‘హిట్-2’, ‘మీట్ క్యూట్’ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
‘U’ for all of U ♥️#AnteSundaranikiOnJune10th pic.twitter.com/AEjlMmAgZz
— Nani (@NameisNani) June 4, 2022