Shyam singha roy story | నాని శ్యామ్ సింగరాయ్ కథ ఇదేనా. సోషల్ మీడియాలో వైరల్..

shyam singha roy story | భారీ అంచనాలతో వచ్చిన వి, టక్ జగదీష్ సినిమాలు నిరాశపరచడంతో కచ్చితంగా ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో పడిపోయాడు నాచురల్ స్టార్ నాని. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. కలకత్తా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేశాడు. సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక ఈ వార్త చక్కర్లు కొడుతుంది.

ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది ఈ సినిమా కథ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కుతోందని భావిస్తున్నారు.. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. శ్యామ్ సింగరాయ్ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒకటి బాగా ప్రచారం జరుగుతోంది. ఇది కాస్తా వైరల్ అవుతుంది. సినిమాలపై ఉండే ఇష్టంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీలోకి వస్తాడు నాని. అప్పటికే షార్ట్ ఫిలిం చేసిన అనుభవం ఉన్న నాని పీరియాడికల్ సినిమా చేయాలని భావించి.. కథ కోసం కోల్‌కతా వెళతాడు. అక్కడ ఒకప్పటి రైటర్ కమ్ జర్నలిస్ట్ అయిన శ్యామ్ సింగరాయ్ గురించి నానికి తెలుస్తుంది. అతడి గురించి ఎక్కువగా స్టడీ చేసి చేసి పూర్తిగా ఆ పాత్ర తనలో ఆవహించుకుంటాడు నాని.

తనకు ఇష్టమైన శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని లీనమైపోయి ఈ కాలంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తాడు. కాకపోతే ఇంటర్వెల్ ముందు వరకు దీన్ని రివీల్ చేయకుండా స్క్రీన్ ప్లేతో రాహుల్ మ్యాజిక్ చేశాడని తెలుస్తోంది. చంద్రముఖి సినిమాలో జ్యోతికలా ఈ సినిమాలో శ్యామ్ సింగరాయ్ పాత్రలో నాని ప్రవర్తన ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో నాని ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి ప్రస్తుత కాలంలో ఏం చేశాడనేదే క్లైమాక్స్ అని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఈ కథ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కథ చాలా ఆసక్తికరంగా ఉంది అంటున్నారు అభిమానులు. దీన్ని ఎలా డీల్ చేస్తారు అనేది మరింత ఆసక్తికరంగా మారింది. సత్యదేవ్ జంగా ఈ సినిమాకు కథ అందించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్
అల్లు అర్జున్ పుష్ప 4 డేస్ కలెక్షన్స్.. 200 కోట్ల వైపు పరుగులు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

