అల్లు అర్జున్ పుష్ప 4 డేస్ కలెక్షన్స్.. 200 కోట్ల వైపు పరుగులు..

Pushpa collections | సాధారణంగా నెగిటివ్ టాక్ వచ్చిన తర్వాత కలెక్షన్స్‌పై దారుణమైన ప్రభావం పడుతుంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా కలెక్షన్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న రోజులవి. అలాంటిది యావరేజ్ టాక్ తెచ్చుకున్న పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. కేవలం తెలుగులో మాత్రమే కాదు మిగిలిన భాషలలో కూడా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తోంది.
ఎలాంటి ప్రమోషన్ లేకుండా హిందీ, తమిళంలో ఊహించని కలెక్షన్స్ సాధిస్తోంది పుష్ప. ఇప్పటికే హిందీలో 10 కోట్ల షేర్.. తమిళంలో 6 కోట్ల షేర్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక కర్ణాటకలో 9 కోట్లు వసూలు చేసింది. మలయాళంలో ముందు నుంచి కూడా అల్లు అర్జున్‌కు అద్భుతమైన మార్కెట్ ఉంది. దాంతో పుష్ప సినిమాకు అక్కడ అఖండమైన ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పటికే నాలుగు రోజుల్లో అక్కడ 5 కోట్లకి పైగా షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అయితే అల్లు అర్జున్ ప్రభంజనం మాటల్లో చెప్పడానికి వీల్లేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.25 కోట్లు వసూలు చేసిన పుష్ప.. ఆ తర్వాత మూడు రోజుల్లో వరుసగా రూ.13.50 కోట్లు, రూ.14.8 కోట్లు, రూ.6.92 కోట్ల షేర్ వసూలు చేసింది. అయినా కూడా మరో రూ.40 కోట్ల షేర్ వసూలు చేస్తే కానీ సేఫ్ జోన్ కు రాదు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.102 కోట్ల బిజినెస్ చేసింది పుష్ప. ప్రపంచ వ్యాప్తంగా 145 కోట్ల బిజినెస్ చేసింది ఈ సినిమా. నాలుగు రోజుల్లో 94 కోట్ల షేర్ వసూలు చేసింది. అందులో 162 కోట్ల గ్రాస్ ఉంది. హిందీ, తమిళంలో మరో రెండు మూడు రోజుల్లో కచ్చితంగా అవ్వడమే కాకుండా లాభాలు కూడా రావడం ఖాయం అయిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరో వారం రోజులు ఇదే ఊపు కొనసాగిస్తే పుష్ప కమర్షియల్‌గా మంచి సక్సెస్ అవుతుంది. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత కొన్ని సన్నివేశాలు కట్ చేశారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన్న ప్రైవేట్ పార్ట్స్ పై అల్లు అర్జున్ చేతులు వేసే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెట్టాయి. అందుకే వీటిని కట్ చేశారు ఇప్పటి వరకైతే పుష్ప కలెక్షన్స్ అద్భుతంగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగితే ఈ సినిమా విజయం వైపు అడుగులు వేయడం ఖాయం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
శ్యామ్ సింగరాయ్, 83 సహా.. క్రిస్మస్కు వస్తున్న సినిమాలు ఇవే..
ఆ హీరోయిన్ కోసం రవితేజను బాలయ్య కొట్టాడా? గొడవలపై క్లారిటీ వచ్చేసింది
Bheemla nayak postponed | భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఎఫ్ 3 రిలీజ్ వాయిదా
Rakul | పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన రకుల్!
Samantha | సెక్సీగా కనిపించడం అంత ఈజీ కాదు.. సమంత షాకింగ్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

