Nandamuri tejaswini | టాలీవుడ్ సీనియర్ యాక్టర్ నందమూరి బాలకృష్ణ నటవారసుడిగా మోక్షజ్ఞ తొలి సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. హనుమాన్ మూవీతో పాన్ ఇండియా మార్కెట్లో తెలుగు సినిమా సత్తా చాటాడు టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు మోక్షజ్ఞ. కాగా స్టార్ కిడ్ సిల్వర్ స్క్రీన్‌పై ఎప్పుడు కనిపిస్తాడనేది క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే మోక్షజ్ఞ కంటే అతని సోదరి, బాలయ్య కూతురు బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. అవును మీరు చదివింది నిజమే. బాలయ్య చిన్నకూతురు తేజస్విని కెమెరా ముందుకొచ్చింది. ఇంతకీ ఏ సినిమానో అనుకునేరు.. తేజస్విని ఓ జ్యువెలరీ కమర్షియల్ యాడ్ కోసం తొలిసారి కెమెరా ముందుకొచ్చిందని ఫిలింనగర్ సర్కిల్ సమాచారం.
ఎప్పటినుంచో మోక్షజ్ఞ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తాడంటూ చర్చించుకుంటున్న మూవీ లవర్స్ ఆ ఎన్నాళ్లకు నెరవేరుతుందనేది తెలియాల్సి ఉంది. ఇక వారి లోటును భర్తీ చేసేందుకు నేనున్నానంటూ ముందుకొస్తుందన్న వార్త ఇప్పుడు నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.
తేజస్విని యాడ్ షూట్ కూడా పూర్తి చేసిందట. త్వరలోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫాంలలో తేజస్విని మెరుబోతుందని సమాచారం. ఈ యాడ్‌తో తేజస్విని తన సోదరుడు మోక్షజ్ఞను బీట్ చేసి మరి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుందన్నమాట.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్