విషమంగానే తారకరత్న పరిస్థితి.. ఆస్పత్రికి చేరుకుంటున్న కుటుంబ సభ్యులు
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది.
Nandamuri Tarakaratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని బెంగళూరు నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. తారకరత్నకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం చికిత్స అందిస్తోంది. తారకరత్న ఆరోగ్య వివరాలను ఆయన భార్య అలేఖ్యా రెడ్డికి వైద్యులు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.
తారకరత్న ఆరోగ్యం విషమంగానే ఉందని తెలుసుకున్న చంద్రబాబు.. బెంగళూరుకు చేరుకున్నారు. కాసేపటి క్రితం నారాయణ హృదయాలయ వైద్యులతో బాబు మాట్లాడి, తారకరత్న ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇక తారకరత్న తండ్రి మోహన కృష్ణ, పురంధేశ్వరి, సుహాసిని, పరిటాల శ్రీరామ్, మాజీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వర్ రావు, చిన రాజప్పతో పాటు పలువురు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు.
నాయకులతో పాటు నందమూరి అభిమానులు కూడా ఆస్పత్రి వద్దకు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న నారా లోకేశ్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న 15 నిమిషాలకే తారకరత్న స్పృహ కోల్పోయిన పడిపోయిన సంగతి తెలిసిందే. హుటాహుటిన కుప్పం ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నిన్న రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు తరలించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

