బాలకృష్ణ అఖండ సినిమాలో నందమూరి హీరో గెస్ట్ రోల్ ?
నందమూరి హీరో గెస్ట్ రోల్ | సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత బాలయ్యతో బోయపాటి శ్రీను చేస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విడుదలైన ఒక్క టీజర్ తోనే బిజినెస్ రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా రేంజ్‌ను మరింత పెంచేలా ఒక వార్త ఇప్పుడు టాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. మరో నందమూరి హీరో ఇందులో గెస్ట్ రోల్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కేవలం ఒక్క టీజర్ తోనే అఖండ ఎలా ఉండబోతుందో అందరికీ చూపించేశాడు బోయపాటి శ్రీను. ఈ చిత్రంలో నటీనటులు సైతం అంతే భారీగా ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న టాప్ కారెక్టర్ ఆర్టిస్టులంతా అఖండ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో సీక్రెట్ కూడా బయటికి వచ్చింది. అఖండ సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఇంటర్వెల్‌కు ముందు ఈ పాత్ర వస్తుందని ప్రచారం జరుగుతుంది. ఇది పోలీస్ ఆఫీసర్ పాత్ర అని.. సెకండాఫ్ లోనూ దాదాపు 20 నిమిషాల వరకు ఉండే పవర్ ఫుల్ రోల్ అని తెలుస్తుంది. గతంలోనే బాబాయ్ అబ్బాయి కలిసి ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు.
అందులో తండ్రి హరికృష్ణ పాత్రలో నటించాడు కళ్యాణ్ రామ్. సినిమా ఫ్లాప్ అయినా కూడా బాలయ్య, కళ్యాణ్ సీన్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ ను బోయపాటి రిపీట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా విడుదలయ్యేంత వరకు కూడా ఇది దాచిపెట్టాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో పూర్ణ, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఒకవేళ అన్నీ కుదిరి నిజంగానే బాలయ్య, కళ్యాణ్ రామ్ కానీ కలిసి స్క్రీన్ పై కనిపిస్తే మాత్రం నందమూరి అభిమానులకు అంతకు మించిన పండగ ఉండదేమో..?
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
హీరోయిన్ కరోనాతో చనిపోయిందంటూ రూమర్స్..!
పవన్ కళ్యాణ్ సినిమాపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!
36 ఏళ్లకే యువ దర్శకుడిని బలి తీసుకున్న కరోనా
త్రిష పెళ్లిపై పలు కథనాలు.. బిజినెస్ మెన్‌తో అంటూ ప్రచారం
Rajinikanth : తమిళనాడు రాజకీయాల నుంచి తలైవా తెలివిగా తప్పించుకున్నాడా?
Udhayanidhi Stalin : సినిమాలకు ఉదయనిధి స్టాలిన్ గుడ్ బై !
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

