పవన్ కళ్యాణ్ సినిమాపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్ ఏప్రిల్ 9న థియేటర్స్ లో విడుదల కాగా, తొలి వారం ఈ చిత్రానికి అశేష ప్రేక్షకాదరణ లభించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో థియేటర్స్‌కు ప్రేక్షకులు రావడం తగ్గించేశారు. దీంతో ఏప్రిల్ 30న చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ ప్రియులని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అయితే ఈ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.
వకీల్ సాబ్ చిత్రంలో నా అనుమతి లేకుండానే ఓ సన్నివేశంలో నా ఫోన్ నెంబర్‌ను స్ర్కీన్‌పై చూపించారని సుధాకర్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా సినిమాలో నా ఫోన్ నెంబర్ చూపించడం వలన నాకు కంటిన్యుయస్‌గా కాల్స్ వస్తున్నాయి. కొందరు నోటికొచ్చినట్టు తిడుతూ నన్ను మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారు అని సుధాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే బాధితుడి తరపు లాయర్ వకీల్ సాబ్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపగా, వారు దీనిపై స్పందించాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు
Long COVID : కరోనా తగ్గినా దీర్ఘకాలికంగా మూడు లక్షణాలు..!
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
బీజేపీ హిందుత్వను హైజాక్ చేసిన మమత, స్టాలిన్, విజయన్
కమలానికి కర్రుకాల్చి వాత
కాంగ్రెస్ కథ ముగిసినట్టే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

