త్రిష పెళ్లిపై పలు కథనాలు.. బిజినెస్ మెన్‌తో అంటూ ప్రచారం

సీనియర్ హీరోయిన్లు చాలా మంది ఈ మధ్య పెళ్లి చేసుకున్నారు. చాలా మంది ముద్దుగుమ్మల వయసు 30 దాటి 40 వైపు పరుగులు పెడుతుంది. నయనతార, అనుష్క లాంటి వాళ్లు అయితే 35 కూడా క్రాస్ చేసి 40 వరకు వచ్చేసారు. అయినా కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఈ లిస్టులోనే త్రిష కూడా ఉంది. ఈమె వయసు కూడా 37 ఏళ్ళు. ఇప్పటికీ పెళ్లి గిల్లీ లేదంటుంది. నిజానికి ఐదేళ్ల కిందే ఈమె ప్రేమలో పడి.. బిజినెస్ మెన్ వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం కూడా చేసుకుంది. అయితే పెళ్లి వరకు వచ్చిన వ్యవహారం చివర్లో పెటాకులు అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వరస సినిమాలు చేస్తుంది త్రిష.
ఇప్పటికీ ఈమె అడపా దడపా సినిమాలు చేస్తూనే ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ త్రిషకు మంచి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి గురించి కూడా ఓపెన్ అయిపోయింది. తనకు ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఇచ్చింది త్రిష. సూటిగా సుత్తి లేకుండా తనకు కాబోయే వాడికి ఉండాల్సిన లక్షణాల గురించి ఓపెన్ అయిపోయింది. తనకు పెద్దగా అందగాడేమీ అవసరం లేదని చెప్పుకొచ్చింది త్రిష. కేవలం తనను బాగా చూసుకునే వాడైతే చాలు అంటుంది. హీరోలా ఉండాలనే రిక్వైర్మెంట్స్ లేవని.. మనిషి కాదు.. మనసు బాగుంటే చాలు అంటూ తెలిపింది త్రిష.
కాబోయే వాడు నలుపైనా పర్లేదని చెప్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఒక్కటి మాత్రం నిజం.. ఇంట్లో చూపించిన వాడిని మాత్రం చస్తే పెళ్లి చేసుకోనని చెప్పుకొచ్చింది. ప్రేమ వివాహమే చేసుకుంటానని బల్ల గుద్ధి మరీ చెప్తుంది త్రిష. ఈమె మాట తీరు చూస్తుంటే ఇప్పటికే ఎవరితోనో త్రిష ప్రేమలో ఉందంటున్నారు అభిమానులు. సోషల్ మీడియాలో కూడా దీనిపై వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈమె ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లికి సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న త్రిష.. ఇప్పుడు మళ్లీ బిజినెస్ మ్యాన్ తోనే పెళ్లికి సిద్ధమవుతుందనే ప్రచారం జరుగుతుండటం విశేషం.
ఇవికూడా చదవండి..
ఖమ్మం కార్పొరేషన్లో స్పీడు పెంచిన కారు..
ఖమ్మం కార్పొరేషన్లో 13వ వార్డు టీఆర్ఎస్ కైవసం
నకిరేకల్ ఏడు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల విజయం
సిద్దిపేట పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యం
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- business man
- Marriage
- Trisha
RELATED ARTICLES
తాజా వార్తలు
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
నీళ్లులేక ఎండిన పంటలు.. జయశంకర్ జిల్లాలో యువరైతు వినూత్న నిరసన : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

