Rajinikanth : తమిళనాడు రాజకీయాల నుంచి తలైవా తెలివిగా తప్పించుకున్నాడా?
తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అందరూ ఒకే మాట చెబుతున్నారు. రజనీకాంత్ ( Rajinikanth ) చాలా తెలివిగా తప్పించుకున్నాడు..

Tamilnadu Assembly Elections : తమిళనాడు ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత అందరూ ఒకే మాట చెబుతున్నారు. రజనీకాంత్ ( Rajinikanth ) చాలా తెలివిగా తప్పించుకున్నాడు.. ఒకవేళ ఆయన పోటీ చేసినా కూడా ఫలితం ఇలాగే ఉండేది.. అందుకే అది తెలిసి ఆరు నెలల ముందే ఎన్నికల బరి నుంచి.. అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు.. ఈ విషయంలో రజినీకాంత్ తెలివి తేటలను మెచ్చుకోవాల్సిందే అంటూ తమిళనాట రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. లేకపోతే మరేంటి..? గత ఏడాది రజినీకాంత్ తన రాజకీయ అరంగేట్రం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అభిమాన సంఘాలను అందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.

ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రజల ముందు ఎలాంటి మేనిఫెస్టో తీసుకువెళ్లాలి.. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని ఎలా ఎండగట్టాలి.. ఇలాంటి విషయాలపై ఆయన అభిమానులతో పాటు చాలా మంది రాజకీయ ప్రముఖులతో కూడా చర్చించాడు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతలపై విమర్శలు కూడా చేశాడు. దీనిపై అక్కడి నుంచి కూడా రివర్స్ కౌంటర్స్ బాగానే పడ్డాయి. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అనుకోకుండా ఒక రోజు మీడియా ముందుకు వచ్చి తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు అందరికీ షాకిచ్చాడు రజినీకాంత్.
దానికి అనారోగ్యం కారణంగా చూపించాడు. అయితే ఇప్పుడు ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక.. కమల్ హాసన్ ( Kamal Hasan ) పార్టీ గుండు సున్నాతో ముగించడం చూసిన తర్వాత రజనీకాంత్ అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అందరికీ ఒక స్పష్టత వచ్చింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఎంత పెద్ద హీరో అయినా కూడా రాజకీయాల్లో రాణించాలంటే అనుభవం కూడా కావాలి. అది లేక కమల్ హాసన్ అత్యంత దారుణంగా ఓడిపోయారు. పైగా చిరంజీవి, మోహన్ బాబు లాంటి సన్నిహితులు కూడా రజినీకాంత్ ను రాజకీయాలకు దూరంగానే ఉండమని సూచించారు. వాళ్ల మాటలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే రజినీకాంత్ నిర్ణయం తీసుకున్నాడు. దానికి తోడు కొన్ని నెలల ముందే ఆయనకు ఎన్నికల ఫలితాలు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ వచ్చిందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. అందుకే సైలెంట్ గా ఎన్నికల నుంచి, రాజకీయాల నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు సూపర్ స్టార్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Udhayanidhi Stalin : తాతకు తగ్గ మనవడు.. తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా గెలుపు
Tamilnadu Assembly Elections : పాత సంప్రదాయాన్నే ఫాలో అయిన తమిళులు
రాహుల్ గాంధీ ప్రచారం చేసిన స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్
ఈ నెల 7న సీఎంగా స్టాలిన్ ప్రమాణం
వైరల్ అవుతున్న 1980నాటి మమతా బెనర్జీ ఫొటో
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

