వైరల్ అవుతున్న 1980నాటి మమతా బెనర్జీ ఫొటో

కోల్కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ను బంపర్ మెజార్టీతో గెలిపించిన మమతా బెనర్జీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ఆశాకిరణంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ కోటను బద్దలుకొట్టిన ఆమె.. ఇప్పుడు తమకు తిరుగే లేదని కాలరెగరేస్తున్న మోదీ, అమిత్ షా జోడీకి చుక్కలు చూపించారు. వీళ్లు అజేయులేమీ కాదని నిరూపించారు. 2016 కంటే కూడా ఎక్కువ స్థానాల్లో గెలిచి ముచ్చటగా మూడోసారి అధికార పీఠం ఎక్కబోతున్నారు. నందిగ్రామ్ ఓటమిని ఆమె లైట్ తీసుకున్నారు.
ఈ విజయం ఆమెను సోషల్ మీడియాలోనూ స్టార్ను చేసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున ఆమె గెలుపు దాదాపు ఖాయమైన తర్వాత 1980నాటి మమత ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ట్విటర్లో ఇండియన్హిస్టరీపిక్స్ అనే హ్యాండిల్ ఈ ఫొటోను పోస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆమెను ఆకాశానికెత్తుతూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇందిరా గాంధీ తర్వాత భారత రాజకీయాలను శాసించిన మహిళ మమతనే అని ఒకరు కామెంట్ చేశారు. భారత రాజకీయ చరిత్రలో ఆమెకు ప్రత్యేకంగా ఒక పేజీ ఉంటుందని మరొకరు అన్నారు.
Mamata Banerjee In 1980s pic.twitter.com/tM36UhIrwG
— indianhistorypics (@IndiaHistorypic) May 2, 2021
She always had "I'm about to end this man's life" face😂 https://t.co/XEMTWNF9W7
— Antisocial_butterflyy (@Sana_be_serious) May 2, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

