Stalin : నాన్న లేడు.. అన్న అండ లేదు.. అయినా గెలిపించాడు
Stalin | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ( DMK ) గెలుపు దాదాపు ఖాయమైంది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకోబోతోంది.

Tamilnadu Assembly Elections | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ( DMK ) గెలుపు దాదాపు ఖాయమైంది. పదేళ్ల తర్వాత ఆ పార్టీ మళ్లీ అధికారం చేజిక్కించుకోబోతోంది. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం వెనుక డీఎంకే అధినేత స్టాలిన్ కీలక పాత్ర పోషించారు. అన్నీ తానై నడిపించి పార్టీని విజయం వైపు నడిపించారు. కరుణానిధి ( Karunanidhi ) మరణం తర్వాత వారసత్వ పోరును తట్టుకుని డీఎంకే పగ్గాలు చేపట్టిన స్టాలిన్ ( M. K. Stalin ).. పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. ఒకవైపు బహిష్కృత నేత, తన అన్న అళగిరి ( Alagiri ) నుంచి ఎప్పటికప్పుడు ఎదురయ్యే తిరుగుబాటును సమర్థంగా ఎదుర్కొంటూ.. మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగిస్తూ పార్టీని ఒక్క తాటిపై నడిపి.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కారణమయ్యారు.

పద్నాలుగేళ్ల వయసు నుంచే ఎంకే స్టాలిన్ డీఎంకే పార్టీకి సేవలందించారు. దీంతో పార్టీలో స్టాలిన్‌కు కరుణానిధి ప్రత్యేక స్థానం కల్పించారు. డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా స్టాలిన్‌ను నియమించారు. కానీ మొదట్నుంచి స్టాలిన్ అంటే నచ్చని ఆయన అన్న, కరుణానిధి కుమారుడు అళగిరి ఈ పరిణామాలు రుచించలేదు. దీంతో ఆయనకు వ్యతిరేకంగా పావులు కదిపేవాడు. అళగిరి వ్యవహారం ప్రతిసారి తలనొప్పిగా మారడంతో ఆయన్ను కరుణానిధి పార్టీ నుంచి బహిష్కరించారు. పార్టీ నుంచి తనను తొలగించినప్పటికీ తన తండ్రికి విధేయుడిగా ఉంటాననే అళగిరి అప్పట్లో ప్రకటించాడు. కానీ తన సోదరుడు స్టాలిన్‌పై ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉండేవాడు. ఆ కోపంతోనే గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రయత్నించాడు. దక్షిణ తమిళనాడులో పట్టు ఎక్కువగా ఉన్న అళగిరి.. డీఎంకే పార్టీ నేతలను ఓడించాలని తన అనుచరులకు పిలుపునిచ్చాడు. ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ పరాజయం పాలైంది.

ఇలా ప్రతిసారి స్టాలిన్‌కు అళగిరి అడ్డుపడుతూనే ఉండేవాడు. ఈ క్రమంలో కరుణానిధి మరణం తర్వాత డీఎంకే పార్టీని చేజిక్కించుకోవాలని అళగిరి ప్రయత్నించాడు. కానీ పార్టీ నేతల మద్దతు స్టాలిన్‌కు ఉండటంతో 2018లో డీఎంకే పార్టీ పగ్గాలు ఆయనకే దక్కాయి. దీంతో పార్టీలో చీలికలు తెచ్చేందుకు కూడా ప్రయత్నించాడు. పార్టీ సీనియర్లలో అసమ్మతి వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లోనూ స్టాలిన్‌ను ఓడించేందుకు అళగిరి ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికల సమయంలో కొత్త పార్టీ పెట్టేందుకు అళగిరి ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. తన అనుచరులతో పాటు డీఎంకేలోని అసమ్మతి నేతలు ఈ పార్టీ చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఒకానొక సమయంలో అళగిరి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.

స్టాలిన్ ఎప్పటికీ సీఎం కాలేడని.. తన మద్దతుదారులు అది జరగనివ్వరని ఈ అసెంబ్లీ ఎన్నికల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అళగిరి ప్రయత్నాలకు తన రాజకీయ ఎత్తుగడలతో స్టాలిన్ ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకొచ్చాడు. కరుణానిధి మరణం తర్వాత పలువురు సీనియర్లు కూడా స్టాలిన్‌పై అసమ్మతి వ్యక్తం చేశారు. అటు అన్న నుంచి వచ్చే తిరుగుబాటును ఎదుర్కొంటూ.. పార్టీలోని అసమ్మతివర్గాలను బుజ్జగిస్తూ పార్టీని బలోపేతం చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు విషయంలోనూ స్టాలిన్ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ను తమ కూటమిలో ఉండేందుకు చివరివరకు ప్రయత్నించాడు. ఆ పార్టీ అడిగినన్ని సీట్లు ఇవ్వకపోయినా.. రెండు పార్టీలకు ప్రయోజనం కలిగే విధంగా సీట్లు సర్దుబాటు చేయడంలో స్టాలిన్ కీలకపాత్ర పోషించాడు. చివరికి పార్టీని గెలిపించాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఇక ఎన్నికల వ్యూహకర్తగా పని చేయను: ప్రశాంత్ కిశోర్
రౌండ్ల వారీగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాలు
సాగర్‌లో కారు దూకుడుకు కమలం ఖతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

