బాలకృష్ణ హిస్టారికల్ డ్రామా
అగ్ర హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో జోష్ మీదున్నారు. సినిమాల మధ్య ఏమాత్రం విరామం లేకుండా వెంటవెంటనే ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 111వ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు.
అగ్ర హీరో బాలకృష్ణ గత కొన్నేళ్లుగా వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో జోష్ మీదున్నారు. సినిమాల మధ్య ఏమాత్రం విరామం లేకుండా వెంటవెంటనే ప్రాజెక్ట్‌లను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న 111వ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. గోపీచంద్ మలినేని దర్శకుడు. నయనతార కథానాయికగా నటిస్తున్నది. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నివ్వగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విఛాన్ చేశారు. హిస్టారికల్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో కనిపిస్తారని, అద్భుతమైన విజువల్స్‌తో పాటు పోరాట ఘట్టాలు అబ్బురపరుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడించనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

