సాయిచరణ్, పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఐక్యూ’. ‘పవర్ ఆఫ్ ద స్టూడెంట్’ అన్నది ఉపశీర్షిక. జీఎల్బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎల్పీ మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి నిర్మిస్తున్నారు.
ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను నందమూరి బాలకృష్ణ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కమర్షియల్ అంశాలతో పాటు ఈ చిత్రంలో సమాజానికి ఉపయోగపడే సందేశం కూడా వుంది. స్టూడెంట్స్ తలచుకుంటే ఏమైనా చేయగలరు అనేది ఈ చిత్ర ఇతివృత్తం’ అన్నారు.