Nandamuri Balakrishna Health Update | ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సర్జరీ జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయం తెలిసి నందమూరి అభిమానులు కంగారు పడుతున్నారు. ఈ మధ్యే కదా ఆయనకు భుజం సర్జరీ అయింది.. అంతలోనే మరోసారి ఆపరేషన్ అయ్యిందా అంటూ టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ అధికారిక PR టీమ్ స్పందించింది. బాలయ్య ఆరోగ్యంపై లేనిపోని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని.. బాలకృష్ణకు ఎలాంటి సర్జరీ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. అనవసరంగా అభిమానులు కంగారు పడొద్దని తెలిపింది.
ఈ విషయంలో మీడియా కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని.. అవాస్తవాలను ప్రచారం చేయొద్దంటూ పీఆర్ టీం కోరింది. ఈ మేరకు బాలకృష్ణ పీఆర్ టీమ్ ఒక ప్రకటన ఇచ్చింది. ‘నటసింహం నందమూరి బాలకృష్ణకు ఎటువంటి సర్జరీ జరగలేదు, ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కొరకు మాత్రమే హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. ఈ రోజు ఆయన సారధి స్టూడియోస్ లో #NBK107 షూటింగ్ లో పాల్గొన్నారు. దయచేసి అవాస్తవాలను ప్రచురించవద్దు, వ్యాప్తి చేయవద్దు. #NandamuriBalakrishna’. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నాడు బాలకృష్ణ. ఈ సినిమా షూటింగ్ సారధి స్టూడియోస్ లో జరుగుతుంది.
“Balakrishna | గోపీచంద్ మలినేని, బాలయ్య సినిమాకు బోయపాటి సాయం..?”
“BB4 | బోయపాటితో నాలుగోసారి బాలకృష్ణ సై.. ఈసారి మామూలుగా ఉండదు!!”
“Anil Ravipudi | బాలకృష్ణ మూవీ మల్టీస్టారరా..? అనిల్ రావిపూడి క్లారిటీ”
“Balakrishna-Raviteja | బాలకృష్ణ-రవితేజ మల్టీస్టారర్..?”