BB4 | బోయపాటితో నాలుగోసారి బాలకృష్ణ సై.. ఈసారి మామూలుగా ఉండదు!!
BB4 | తెలుగు ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ఉన్న క్రేజ్ మాటల్లో చెప్పడం సరిపోదు. అలాంటి అద్భుతమైన కాంబినేషన్ బాలకృష్ణ, బోయపాటి శ్రీను. గత 11 ఏళ్లలో 3 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చింది ఈ కాంబినేషన్. అది కూడా బాలకృష్ణ వరస ఫ్లాపుల్లో ఉన్నప్పుడు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. అందుకే ఈ కాంబినేషన్లో సినిమా అంటే బాక్సాఫీస్ దద్దరిళ్లిపోతుంది. గతేడాది ఇద్దరూ కలిసి చేసిన అఖండ ఎలాంటి సంచలనం సృష్టించింది అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో కూడా 75 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి తెలుగు ఇండస్ట్రీకి ఊపిరిపోసింది అఖండ.

బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది అఖండ. దీనికి ముందు లెజెండ్, సింహా సినిమాలతో కూడా బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేసింది బోయపాటి, బాలయ్య కాంబినేషన్. ఇలాంటి బ్లాక్ బస్టర్ జోడీ మరోసారి కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. నిజానికి బోయపాటి శ్రీను ఎప్పుడు అడిగినా.. బాలయ్య కాదనే సమస్య లేదు. ఎందుకంటే ఆయన గురించి బాలయ్యకు బాగా తెలుసు.. అలాగే బాలయ్యను ఎలా వాడుకోవాలో బోయపాటికి తెలిసినట్లు మరే దర్శకుడికి తెలియదు.
అందుకే ఈ కాంబినేషన్లో సినిమా కోసం కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు.. డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆసక్తిగా వేచి చూస్తుంటారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడిలతో సినిమాలు కమిట్ అయ్యాడు బాలకృష్ణ. మరోవైపు బోయపాటి శ్రీను కూడా రామ్ పోతినేని హీరోగా ఒక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. ఈ కమిట్మెంట్స్ పూర్తయిన తర్వాత బోయపాటి, బాలయ్య నాలుగో సినిమా మొదలు కానుంది. అయితే అది అఖండ తరహాలో కాకుండా లెజెండ్ మాదిరి పొలిటికల్ టచ్ ఉన్న కథ అని తెలుస్తోంది. ఏదేమైనా ఈ కాంబినేషన్ అంటేనే అభిమానులకు పూనకాలు గ్యారెంటీ. మరి ఈసారి ఎలాంటి సంచలన సినిమాతో ఈ ఇద్దరూ రాబోతున్నారో చూడాలి.
Read More :
RAPO20 | బోయపాటి, రామ్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..”
“Anil Ravipudi | బాలకృష్ణ మూవీ మల్టీస్టారరా..? అనిల్ రావిపూడి క్లారిటీ”
“Balakrishna-Raviteja | బాలకృష్ణ-రవితేజ మల్టీస్టారర్..?”
NBK107 Big update | బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్..!”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Balakrishna
- BB4
- Boyapati
- nbk
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

