RAPO20 | బోయపాటి, రామ్ సినిమాలో ఆ బాలీవుడ్ హీరోయిన్ ఫిక్స్..
Parineeti Chopra in RAPO20 | మొన్న వచ్చిన అఖండ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రతికూల పరిస్థితుల్లో కూడా 70కోట్లకు పైగా వసూలు చేసి మాస్ సినిమా సత్తా చూపించింది. దీంతో బోయపాటితో సినిమా చేయడానికి మళ్లీ స్టార్ హీరోలు రెడీ అయిపోయారు. కానీ ఈయన మాత్రం తన పంథా మార్చి యంగ్ హీరో వైపు అడుగులు వేశాడు. ఈయన తర్వాత సినిమా రామ్ పోతినేనితో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ మధ్య వచ్చింది. నిజానికి అఖండ సినిమా కంటే ముందే రామ్ హీరోగా బోయపాటి ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో అప్పుడు ఆ సినిమా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్‌గా వీళ్ల కాంబినేషన్లో సినిమా వస్తుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రామ్ సినిమా రాబోతుంది.
ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు రామ్ పోతినేని. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి ఈ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇస్తున్నాడు రామ్ పోతినేని. ఇప్పటికే హిందీలో ఈయన డబ్బింగ్ సినిమాలకు మంచి వ్యూస్ వస్తున్నాయి. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ లాంటి సినిమాలు వందల మిలియన్ల వ్యూస్ అందుకున్నాయి. ఈ మార్కెట్ ఇంకా పెంచుకోవడానికి ఇప్పుడు హిందీలో కూడా సినిమా విడుదల చేయబోతున్నాడు. అయితే పాన్ ఇండియా సినిమాలో కేవలం హీరో మాత్రమే కాకుండా హీరోయిన్ కూడా అన్ని ఇండస్ట్రీలకు తెలిసిన మొహం అయి ఉండాలి. అందుకే ఇప్పుడు రామ్ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.
అప్పట్లో తుఫాన్ ( జంజీర్)లో ప్రియాంక చోప్రా.. మొన్న సాహోలో శ్రద్ధా కపూర్.. హిందీలో ఎంతో కొంత సినిమాలకు హెల్ప్ అయ్యారు అందుకే రాజమౌళి కూడా తన ట్రిపుల్ ఆర్ సినిమా కోసం అజయ్ దేవగణ్, ఆలియా భట్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌ను తీసుకున్నాడు. ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు. ఇదే ఫార్ములా రామ్ సినిమాకు అప్లై చేస్తున్నారు. బోయపాటి సినిమా కోసం పరిణీతి చోప్రాను తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతానికి బాలీవుడ్లో ఈమెకు పెద్దగా అవకాశాలు లేవు. ఇలాంటి సమయంలో రామ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుంది పరిణీతి. మొత్తానికి రామ్ తో ఈ బాలీవుడ్ బ్యూటీ ఫిక్స్ అని ప్రచారం జరుగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

